సాక్షి డిజిటల్ న్యూస్ 3 నవంబర్నారాయణపేట నియోజకవర్గం ఇంచార్జీ క్రిష్ణ ధన్వాడ: మండలంలోని గున్ముక్ల గ్రామంలో శివాలయ పునరనిర్మాణం లో భాగంగా శివలింగం, నంది మరియు ధ్వజస్తంభ ప్రతిష్టపన కార్యక్రమం భక్తుల సమక్షంలో వేద పండితుల మంథ్రచరణ లతో ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ యువకులు శివ భక్తులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆలయ నిర్మాణ దాతలకు, రాజకీయ నాయకులను సన్మానించారు.ఈ కార్యక్రమం లో కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు బాలయ్య గౌడ్, నర్సింహా రెడ్డి, కృష్ణయ్య, నర్సిములు, పూజారి నాగార్జున, యువకులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు