సాక్షి డిజిటల్ న్యూస్: 2 నవంబర్, పాల్వంచ. రిపోర్టర్:కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఈ నెల 6న డ్రాయింగ్ పై టెస్ట్ ఉంటుందని,ఈ టెస్టులో నైపుణ్యం ప్రదర్శించిన వారికి,3 నెలల ఉచిత ఫర్నిచర్ అసిస్టెంట్ శిక్షణ ఉంటుందని,ఈ కార్యక్రమం ద్వారా ఫర్నిచర్ ప్రొడక్షన్, ఇన్స్టలేషన్, మెషీన్ ఆపరేషన్ రంగాల్లో నైపుణ్యం సాధించి ఉద్యోగ అవకాశాలు పొందొచ్చని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ట్రైనింగ్ పూర్తి చేసిన వారి నెలకు రూ.15000/ అప్రెంటిస్ షిప్ అవకాశాలు ఉంటాయి.ఆసక్తి ఉన్న వారు ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. రిజిస్ట్రేషన్ లింక్ HTTPS: //TINYURL.COM/4ZV2BN67. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 79958 06182. 77994 70817.