అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంబు.కొత్తకోట మండలం భీరంగిగ్రామంలో నిపూజారి మేకల వెంకటేష్ స్వామిమరియు గ్రామప్రజల ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుండి శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా పూజారి మేకల వెంకటేష్ మాట్లాడుతూ ఆదివారం బీరంగి గ్రామంలో బ్రహ్మంగారి ఆరవ జయంతి వేడుకల సందర్భంగా ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు గోపూజతో మొదలై సాయంత్రం నాలుగు గంటల నుండి అన్నమయ్య కీర్తనలు రాత్రి 8 గంటల నుండి చెక్కల కోలాటం జరుగునని తెలిపారు. వీరబ్రహ్మం గారి జయంతి వేడుకలకు వచ్చు భక్తులకు అన్నదాన సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు ఆలయ పూజారి తెలిపారు.