సాక్షి డిజిటల్ న్యూస్ ,నవంబర్ 02, రామకృష్ణాపూర్: రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిమడుగు గ్రామంలో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం జరిగిందని రామకృష్ణ పూర్ పట్టణ ఎస్సై జి రాజశేఖర్ తెలిపారు. అనంతరం ఎస్సై రాజశేఖర్ మాట్లాడారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని గ్రామ ప్రజలకు రోడ్డుమీద వాహనాలు నడిపేటప్పుడు వాహనాలతో ప్రయాణం చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం జరిగిందని అన్నారు. గ్రామంలోని ముఖ్యమైన వ్యక్తులతో యువకులను ఒక జట్టుగా చేర్చి కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించేలా పులిమడుగు గ్రామ ప్రజలకు వాహనదారులతో యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వీపిఓ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, జాతీయ రహదారి అధికారి సిబ్బంది పాల్గొన్నారు.