కారేపల్లి, నవంబర్ 2 (సాక్షి డిజిటల్ న్యూస్): ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాల ఫలితంగా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కారేపల్లి ఎక్స్ రోడ్డు ప్రాంతానికి చెందిన బైక్ మెకానిక్ రాజేందర్ భావోద్వేగంతో వెల్లడించారు. శనివారం లింగంబజార చౌకదర దుకాణంలో నాన్ ఓవెన్ సంచిలో సన్నబియ్యం పొందిన అనంతరం మాట్లాడిన ఆయన, అర్హులైన ప్రతి రేషన్ కార్డుదారికి నాణ్యమైన సన్నబియ్యం, నాన్ ఓవెన్ సంచులను ప్రభుత్వం అందజేయడం ప్రజల పట్ల ఉన్న కట్టుబాటుకు నిదర్శనమన్నారు. సన్న బియ్యం పొందేందుకు ఒక వేలిముద్ర, నాన్ ఓవెన్ సంచికి మరో వేలిముద్ర అవసరమని తెలిపారు. రేషన్ కార్డు నమోదు చేసిన అదే దుకాణంలోనే వేలిముద్ర విధానం ద్వారా సంచి అందిస్తారని చెప్పారు. అయితే, పోర్టబిలిటీ ద్వారా ఇతర దుకాణాల్లో బియ్యం తీసుకునే వారికి ఈ సదుపాయం వర్తించదని స్పష్టం చేశారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ
కార్యక్రమంలో రేషన్ డీలర్ రమేష్, ఉపేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.