సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 2. భైంసా (నిర్మల్ జిల్లా) సోమవారం నుండి భైంసా పట్టణంలోని కాటన్ మార్కెట్ యార్డ్ నందు సి. సి. ఐ. పత్తి కొనుగోళ్ళను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపాడు ఉదయం 9 గంటలకు కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సి. సి. ఐ. ద్వారా పత్తి క్వింటాలుకు 8110 రూపాయల మద్దతు ధర లభిస్తుందన్నారు. భైంసా మరియు కుభీర్ లో కేంద్రాలు ప్రారంభం అవుతాయన్నారు.