సాక్షి డిజిటల్ న్యూస్:2 నవంబర్, పాల్వంచ. రిపోర్టర్:కె.జానకిరామ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని, కొత్తగూడెం క్లబ్ నందు సింగరేణి సంస్థ సహకారంతో ఈ నెల 11న నిర్వహించే మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో,కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజుతో కలిసి జాబ్ మేళా బ్రోచర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ, పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, పీజీ, ఫార్మసీ వంటి అర్హతలతో 18 నుండి 40 ఏళ్ల వయస్సు గల యువతీ యువకులు జాబ్ మేళాకు హాజరు కావొచ్చన్నారు.అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, వాటి జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా,సింగరేణి సంస్థ అధికారులు పాల్గొన్నారు.