సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్.2 బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి. భవణ నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ.
భవణ నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలీం భాషా. రాష్ట్రంలో ఎన్నికల హమీలో భాగంగా భవణ నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని అందుకు నిర్మాణ కార్మికులంతా ఉద్యమిద్దామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ,భవణ నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలీం భాషా తెలిపారు. ఆదివారం బి కొత్తకోట లో తాపీ మేస్త్రీ, వర్కర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కావస్తున్నా నేటికీ భవణ నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని హామీ అమలు కాలేదని కారణంగా నిర్మాణ రంగం కార్మికులు నష్టపోతున్నారని తెలిపారు. సంక్షేమ బోర్డు సాధనకోసం కార్మికులు అనేక ఉద్యమ పోరాటాలు ఫలితంగా 2006 లో ఉమ్మడి రాష్ట్రంలో సాధించుకున్నారని ,గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ బోర్డును రద్దు చేసి నిర్మాణ కార్మికులను సంక్షేమ పథకాలకు దూరం చేసిందని ఆరోపించారు. తక్షణమే కూటమి ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.పెండింగ్లో క్లైములకు నిధులు కేటాయించాలని కోరారు.55 సంవత్సరాలు నిండిన నిర్మాణ కార్మికులకు నెలకు 5000/- పెన్షన్ ఇవ్వాలని కోరారు.కార్మికుల పిల్లలకు విద్య, వైద్య సదుపాయం, స్కాలర్షిప్ అందించాలని కోరారు. సమావేశం అనంతరం తాపీ మేస్త్రీ & వర్కర్స్ యూనియన్ బి కొత్తకోట మండల కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడు ఆకుల కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు తంబశెట్టి, నందిని బి.శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి రామాంజులు
సహయ కార్యదర్శిలు శివశంకర్, వెంకటయ్య కోశాధికారి వెంకటరమణ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తంబళ్లపల్లి నియోజకవర్గ అద్యక్షుడు వేణు గోపాల్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, ఖాదర్ భాషా, నాగమ్మ,రెడ్డప్ప, రాము తదితరులు పాల్గొన్నారు. 
