సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 02 రిపోర్టర్ షేక్ సమీర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల పక్షాన ప్రశ్నిస్తే దాడి చేస్తారా, ఈ దాడి ఓ పిరికిపంద చర్య అని మండిపడ్డారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ గుండాలతో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి చేశారని, పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించాలని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్న ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఆని ప్రశ్నించారు.. లా అండ్ ఆర్డర్ అదుపుతప్పడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణమని విమర్శించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అదేవిధంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తారు.. గత బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ ఇలాంటి దాడులు జరగడంలేదని గుర్తుచేసారు.! బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.