బక్కని సంచలనం..

★కన్హా శాంతి వనంలో ఉన్న నిషేధిత భూముల వివరాలు ఇవ్వండి ★టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ★సమాచార హక్కు చట్టం ద్వారా నందిగామ తహసిల్దార్ కు వినతి

సాక్షి డిజిటల్ న్యూస్, NOV-02, ఫరూక్ నగర్ /రిపోర్టర్ కృష్ణ, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నందిగామ మండల పరిధిలోని చేగురు గ్రామంలో ఉన్న నిషేధిత భూములకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు సమాచార హక్కు చట్టం ద్వారా నందిగామ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. నందిగామ మండలంలోని చేగురు గ్రామంలో ఏర్పాటైన కన్హా శాంతి వనంలో నిషేదిత భూములు ఉన్నాయనే అభియోగాలు ఉన్నాయని తన దరఖాస్తులో పేర్కొన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ హయాంలో గ్రామాల్లో పర్యటించినప్పుడు స్మశాన వాటికలు, గైరాన్ భూములు, సీలింగ్, భూధాన్, అసైన్డ్ భూములు ఉండేవన్నారు. అవి కాస్త ఆక్రమణలకు గురయ్యాయని ఆరోపణల నేపద్యంలో చేగురు గ్రామంలోని చెరువులు, కుంటలు, వాగులు, అసైన్డ్, భూదాన్, ఇనాం దస్తు గర్ధా భూములు కన్హా శాంతి వనంలో ఉన్నట్లయితే సమాచార హక్కు చట్టం ద్వారా తెలియజేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు ఏకంగా కన్హ శాంతివనం వివరాలు అత్యంత ధైర్యంగా అడగడం పట్ల సంచలనం రేకెత్తిస్తుంది. అనునిత్యం దేశ రాష్ట్ర విదేశీ ప్రముఖులతో విరాజిల్లుతున్న శాంతివనం పై కన్నీటి చూడడానికి కూడా చాలామంది వెనకడుగు వేస్తారు కానీ మాజీ ఎమ్మెల్యే బక్కని గత కొంతకాలంగా కన్హ శాంతివనం తీరుపై అవకాశం ఉన్నప్పుడల్లా ప్రశ్నించడం గమనార్హం..