సాక్షి, డిజిటల్ న్యూస్, నవంబర్ 2, శంకరపట్నం,సీనియర్ జర్నలిస్టు ,బిఆర్, (శ్రీరాంపూర్ మంచిర్యాల జిల్లా)
ప్రతి సింగరేణి ఉద్యోగి నిత్యం డ్యూటీకి వచ్చే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే ఫైవ్ గని ఫిట్ సెక్రెటరీ నర్సింగరావు వెల్లడించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, ప్రతి ఉద్యోగి డ్యూటీకి వచ్చే విధంగా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు, మారుతున్న పరిస్థితులను బట్టి రాజకీయాల కు అతీతంగా గని కార్మికులు ఈ విషయంలో జాప్యం చేయకుండా నిత్యం డ్యూటీకి వచ్చే విధంగా సూచనలు సలహాలు ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు, రోజురోజుకు మార్కెట్లో నిత్యవసర సరుకులు అధికంగా పెరగడం కాకుండా జీవన విధానం సక్రమంగా కొనసాగేందుకు కార్మికులను అన్ని రకాలుగా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు, ఈ విషయంలో కార్మికులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా, విధిగా డ్యూటీకి వచ్చే విధంగా అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు, ఇందుకు గని కార్మిక సంఘాల నాయకులు ప్రతి ఒక్క కార్మికుడు సహకరించాలని నర్సింగరావు కోరారు