ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం

సాక్షి డిజిటల్ న్యూస్ 3నవంబర్ 2025 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి, జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు,డిక్కిజిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి రవి శంకర్ ఎం బి బి ఎస్, డి డి ఎం.డి ఎఫ్ ఎం జగిత్యాల పూల మాలతో నివాళ్లు అర్పించి సేవలను స్మరించారు. అంబేద్కర్ దేశానికి అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం,న్యాయం సామాజిక సంస్కరణలో వారి ఆలోచనలు, ఆశయాలను ఆదర్శల ద్వారా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందటంతో పాటు స్మరించుకోవాలని కార్యక్రమం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నామని నల్ల శ్యామ్ తెలిపారు.అంబేద్కర్ రాజ్యాంగం రాయకుంటే పీడిత వర్గాలు బానిసలుగా మిగిలిపోయేవారని అన్నారు. జగిత్యాల జిల్లా ప్రకటన జరుగక మునుపే జగిత్యాల లో మెడికల్ కాలేజీ కావాలని మెడికల్ కాలేజీ సాధన అవగాహణ కార్యక్రమం సొంతంగా జిల్లా మొత్తం ఊరు వాడ తిరిగారు. కొత్త జిల్లాల్లో ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రకటనలో భాగంగా జగిత్యాలకు ప్రకటించారని గుర్తు చేశారు. ముఖ్య అతిథి రవి శంకర్ మాట్లాడుతూ భారత సమాజంలో కుల వివక్ష అనే మహమ్మారి భారీ నుంచి నేనున్నా అనే వెలుగు ఈరోజు వరకు కూడా మండే సూర్యునిలా ప్రసారింపచేసిన గొప్ప లౌకిక మానవతావాది అంబేద్కర్ అని కొనియాడారు. పిడిత వర్గాల ఆత్మగౌరవం ఆకాశమంతాఎత్తుకు నిలబెట్టిన గొప్ప మేధావి అని అన్నారు అగ్రకుల ఆటలో బహుజనులను గొడ్డలికి కామల వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గొడ్డలి కామా అనే బహుజనులను ఆధారం చేసుకొని వేటు అదే బహుజనులపై వేస్తున్న ప్రమాదాన్ని గుర్తించాలని కోరారు. ఆధునిక నవ భారత నిర్మాణం కోసం కలలు కన్నారు.అంబేద్కర్ కలలు కన్నా కులవ్యవస్థ నిర్మూలన కోసం బహుజనులు మహనీయుని ఆశయాలను,ఆలోచనలను నిరంతరం పఠనo చేసి ఉపాధ్యాయునిల తయారై గొప్ప అంబేద్కర్ వాదులను తయారు చేయాలనీ పిలుపునిచ్చారు పిడిత వర్గాలకు విముక్తి కోసం అంబేద్కర్ ని జ్ఞాన చిహ్నం గా గుర్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తక్కళ్ళ దేవయ్య మట్టిపూలు పత్రిక సంపాదకులు,ఆనంతుల కాంతారావు ఎడిటర్ తెలంగాణ శక్తి,పులి గోవర్ధన్ బరిసే కళావేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాయితీ శ్రీనివాస్ అధ్యక్షులు జిల్లా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం,కూర్మాచలం ఉమామహేష్ న్యావవాది,కంటె అంజయ్య ప్రధాన కార్యదర్శి పట్టణ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం,బొల్లం ప్రభాకర్,దుమాల గంగాధర్,నల్ల విజయ్ దాసండ్ల కమలాకర్, చింతకుంట్ల గంగాధర్, మద్దెల రవి, లక్కం సురేష్, నక్కరవి, సంకె మహేష్, జక్కుల నర్సయ్య, తదితర అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.