నేటి నుండి కామేపల్లిలోనిత్య అన్నదానం ప్రారంభం

*అయ్యప్ప ట్రస్ట్ సేవా సమితి సహకారంతో..శ్రీ ముండ్రు పుల్లయ్య గురు స్వామి ఆధ్వర్యంలో కామేపల్లిలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభం *నిత్య అన్నదానం కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు,భవాని మాతలు అందరూ పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించాలని పిలుపు *కామేపల్లి అయ్యప్ప ట్రస్ట్ సేవా సమితి కన్వీనర్ ముండ్రు పుల్లయ్య గురుస్వామి

సాక్షి డిజిటల్ న్యూస్ (కామేపల్లి నవంబర్ 2) : అయ్యప్ప ట్రస్ట్ సేవా సమితి కామేపల్లి సహకారంతో శ్రీ ముండ్రు పుల్లయ్య గురు స్వామి వారి ఆధ్వర్యంలో కమిటీ బృందం సభ్యుల నేతృత్వంలో నిత్య అన్నదాన కార్యక్రమంను నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప ట్రస్ట్ సేవా సమితి కన్వీనర్ యం. పుల్లయ్య గురుస్వామి తెలిపారు. ఆదివారం కామేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుల్లయ్య గురుస్వామి మాట్లాడుతూ ఈనెల 3 సోమవారం నుండి నిత్య అన్నదాన కార్యక్రమంను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నిత్య అన్నదానం కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు,భవాని మాతలు పాల్గొని అన్న ప్రసాదంను స్వీకరించాలని ఆయన కోరారు. గత 7 సంవత్సరాల నుండి కామేపల్లిలో నిత్య అన్నదాన కార్యక్రమంను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి అయ్యప్ప ట్రస్ట్ సేవా సమితి కమిటి ప్రతినిధులు ఆరుద్ర బ్రహ్మచారి, ముండ్రు మురళి, తాళ్లూరి జనార్ధన్ గురు స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *