సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 2 భద్రాచలం రిపోర్టర్ గడ్డం సుధాకర్ రావు; భద్రాచలం పట్టణంలోని జగదీష్ కాలనీ లో ఒక వికలాంగుడైన ఆదివాసి వాల్మీకి జాతికి చెందిన కృష్ణ శ్రీనివాసరావు దంపతుల ను అమానుషంగా ఓ యువకుడు దుర్బశలాడి అమానుషంగా వారిపై దాడి చేసిన వైనం చోటుచేసుకుంది ఈ వికలాంగుడి పై దాడిని పలు కుల సంఘాలు ప్రజా సంఘాలు ఆ దంపతులను పరామర్శించి తీవ్రంగా ఖండించాయి ఈ సందర్భంగా బాస్ కమిటీ నాయకులు కుంజా ధర్మ, మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలోని జగదీష్ కాలనీ లో నివాసం ఉంటున్న వికలాంగుడు అయిన కృష్ణ శ్రీనివాస్ ఆదివాసి దంపతులను వారి ఇంట్లోనే రెంటుకుంటున్న యువకుడు తాగిన మత్తులో ఇంట్లో ఉన్న వారి పైన దౌర్జన్యంగా అనేక బూతులు తిడుతూ భౌతిక దాడికి పాల్పడ్డాడు ఈ సంఘటన అత్యంత దారుణమైన సంఘటనగా పేర్కొంటున్నామని ఆయన అన్నారు అమానుషంగా దాడి చేయడం సరైనది కాదని ఇటువంటి దాడులు పునరావతం కాకుండా పోలీస్ అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు తక్షణమే పోలీస్ అధికారులు సముద్రమైన దర్యాప్తు నిర్వహించి ఆదివాసి దంపతులను దాడి చేసిన వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులను కోరారు దాడికి గురైన కిష్టాశ్రీనివాస్ దంపతులను పరామర్శ చేసిన వారిలో ఎమ్మార్పీఎస్ మాజీ నాయకులు అలవాల రాజా మాదిగ మాల మహానాడు జిల్లా కార్యదర్శి అల్లాడి పౌల్రాజ్ బాస్ కమిటీ అధ్యక్షులు పూనెం కృష్ణ దొర మహాజన సమితి అధ్యక్షులు గడ్డం సుధాకర్ రావు ఏజెన్సీ ప్రజా సంక్షేమ సంఘం ఆర్గనైజింగ్ రాష్ట్ర కార్యదర్శి కనకం శ్రీమన్నారాయణ భద్రాద్రి ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఊటుకూరి సాయిరాం కార్యదర్శి అన్నం సత్తిబాబు ఆటో యూనియన్ జేఏసీ అధ్యక్షులు మర్మం శంకర్ మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత పరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి అధ్యక్షులు కొమ్మ గిరి వెంకటేశ్వర్లు, అప్పన దాస్ బాబు , కుచర్ల కుమారి కొప్పుల నాగమణి డేగల శివ తదితరులు పాల్గొన్నారు