ఎన్ని కుట్రలు చేసినా? నవీనన్న గెలుపు ఆపలేరు

★పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్న టిఆర్ఎస్ (బిఆర్ఎస్)ను ★ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఓడించి బొందపెట్టాలి • టిఆర్ఎస్ బిజెపి ఒక తాను ముక్కలే ★ సింగరేణి మండల కాంగ్రెస్ నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్:కారేపల్లి, నవంబర్ 2. పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతిన్న బి.ఆర్.ఎస్. నాయకులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో ఓటు అడిగే హక్కు లేదన్నారు. టిఆర్ఎస్ బిజెపి ఒక తాను ముక్కలే గత పార్లమెంటు ఎన్నికల నుంచి వాటి మధ్య పొత్తు ఉందని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం తద్యం అని సింగరేణి మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. సింగరేణి మండల నాయకులు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ వెంట పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజారిటీ తో విజయం సాధిస్తాడని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం నవంబర్ 1 న ప్రవేశపెట్టిన నాన్ ఓవెన్ సన్న బియ్యం, అలాగే ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సుప్రయాణం, ఉచిత కరెంటు, రూ.2లక్షల రుణమాఫీ, ఉచిత గ్యాస్ సబ్సిడీ రూ. 21వేల కోట్ల రుణమాఫీ 56వేల కొలువులు ఇచ్చాం అని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమ పథకాల వలన ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని వారు ధీమావ్యక్తం చేశారు.