సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 02, రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో పని చేసే చాట్ల శంకరమ్మ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని స్థానిక నాయకుడు జంగంపల్లి మల్లయ్య రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్ కు తెలపడంతో యువత జనం కోసం వాట్సాప్ గ్రూప్ ద్వారా పట్టణంలోని పలువురికి విషయాన్ని చేరవేశారు. దాతల సహకారంతో సుమారు 15 వేల రూపాయలు సేకరించి సాయిబాబా దేవాలయంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య చేతులమీదుగా చాట్ల శంకరమ్మకు ఆర్థిక సహాయాన్ని అందించారు. పేదవారికి ఏదైనా ఆపద ఉన్నట్లయితే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాతలు ద్వారా సేకరించిన విరాళాన్ని బాధితులకు అందిస్తున్నామని ఇకముందు సైతం పేదలకు అందుబాటులో ఉండేందుకు రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని సంస్థ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సభ్యులు పాల్గొన్నారు