స్పెషల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి.

★భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు.

సాక్షి డిజిటల్ న్యూస్:1 నవంబర్,పాల్వంచ. రిపోర్టర్:కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఎస్పీ రోహిత్ రాజు నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమావేశంలో,ఈ నెల 15న జరిగే స్పెషల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని,పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయ అధికారులతో సమన్వయం పాటిస్తూ,ప్రతి ఒక్కరూ భాద్యతగా పనిచేయాలని అన్నారు.అలాగే స్టేషన్ల వారీగా పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సమావేశానికి కోర్టు డ్యూటీ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.