సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 1 మణుగూరు/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: మాజీ ఉద్యోగుల వెతలు కన్నీరు మున్నీరై జీవన చిత్రములో ఒక దిక్కు ఉద్యోగులు మరో దిక్కు మాజీ ఉద్యోగుల దయానందన బతుకు చిత్రం విచిత్రంగా మారింది. 1998 సంవత్సరం నుండి పెన్షన్ అమలు నుండి నేటి వరకు పెరుగుదల లేక చాలీచాలని పెన్షన్లతో బ్రతుకు జీవుడా అంటూ దుర్భర స్థితులలో కూలీల నుండి దినసరి కూలీలతో జీవనం సాగిస్తున్న సింగరేణి మాజీ ఉద్యోగుల బతుకు పరిస్తితులను తలుచుకుంటేనే అయ్యో పాపం అనే దుస్థితికి చేరుకుంది. వెయ్యి రూపాయల పెన్షన్ మొదలు 3000 రూపాయలతో జీవనం సాగించే మాజీ ఉద్యోగుల దుర్భర ఆకలి స్థితులను దీర్ఘకాలిక వ్యాధులతో ఆత్మహత్యలకు బలవుతున్న మాజీ ఉద్యోగుల ఆక్రందనాలు సింగరేణి క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబాలలో రగులుతున్న నిరసన జ్వాలలు. ఎన్నో విన్నపాలు ఎన్నెన్నో వేడుకోలు నేటి రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు కానీ దయతెలచని రాజకీయ ట్రేడ్ యూనియన్ నాయకుల నిర్లక్ష్యపు ధోరణి పెన్షన్ ఉద్యోగుల బ్రతుకులను వెక్కిరిస్తుంటే అయ్యో పాపం అనే నాయకులు లేక పెన్షన్ దారుల బ్రతుకులు రోడ్ల పాలవుతుంటే సానుభూతి లేక చూస్తూ వెళ్ళిపోతున్న నేటి ఉద్యోగులు రేపటి మాజీ లే కదా భద్రం కొడుకు కొమరన్న సింగరేణి కొలువు కాడ.