సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పెనాల్టీ పై స్పష్టత ఇవ్వాలి

* బెల్ట్ క్లీనింగ్, మక్ రిమూవల్ , సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలి. *ఐ ఎస్ టి యు ఆధ్వర్యంలో జిఎం సివిల్ ధనసరి వెంకటేశ్వర్లు వినతి

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 1 మణుగూరు/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన పెనాల్టీ పై స్పష్టత ఇవ్వాలి బెల్ట్ క్లీనింగ్, ఓసి గనులలో భారీ యంత్రాల మక్ రిమూవల్ కాంట్రాక్ట్ కార్మికులను, హెల్పర్లను సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలనీ కోరుతూ
ఐ ఎస్ టి యు ఆధ్వర్యంలో కొత్తగూడెంలో హెడ్ ఆఫీస్ లో జిఎం సివిల్ ధనసరి వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులు అనారోగ్య కారణాన లేదా మరేదైనా అత్యవసర పరిస్థితులలో విధులకు గైర్హాజరు అయితే పెనాల్టీ విధించేవారనీ కాంట్రాక్ట్ కార్మికులు మరియు కార్మిక సంఘాల ఆందోళనల ఫలితంగా సింగరేణి యాజమాన్యం స్పందించి పెనాల్టీ రద్దు ఆదేశాలు జారీ చేశారనీ సంతోషం కానీ మరలా ఏరియా కటింగ్ పేరు పై పెనాల్టీ విధిస్తున్నారని పెనాల్టీ సొమ్ము సంబంధిత కాంట్రాక్ట్ కార్మికులు అనధికారికంగా నేరుగా తమకు చెల్లిస్తేనే జీతాలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని కాంట్రాక్టర్లు ఒత్తిడి చేస్తున్నారనీ కాంట్రాక్ట్ కార్మికుల అభియోగం అని కాంట్రాక్ట్ కార్మికులకు ఎలాంటి పెనాల్టీ లేదని చట్టపరంగా అలా ఉంటే జీతంలో కోత విధించి మిగిలిన సొమ్మునే తమ తమ బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తారు. కదా అన్నది కార్మిక సంఘాలుగా తమకున్న అభిప్రాయం అని ఈ విషయంపై యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని కోరారు ఏది ఏమైనా కాంట్రాక్ట్ కార్మికుల నుంచి ఎలాంటి వసూలు చేసే నిబంధన రద్దు చేయాలని అదేవిధంగా బెల్ట్ క్లీనింగ్, భారీ యంత్రాల మక్ రిమూవల్,సివిల్ ఫిట్టర్, ఇతర హెల్పర్లను సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *