సబ్ రేషన్ షాప్ అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ప్రజలు

★సబ్ రేషన్ షాప్ ప్రారంభించిన తహసీల్దార్ జ్యోతి

సాక్షి డిజిటల్ నవంబర్ 01 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్ మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6 వ వార్డ్ ఇందిరానగర్ కాలనీ ప్రజలు అనేక సంవత్సరాలుగా ప్రతి నెల రేషన్ సరుకులు సమాకుర్చుకోవాడానికి రేషన్ షాప్ కి రవాణా సౌకర్యం లేక పోవడం తో ఇందిరానగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్నీ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంతరావు దృష్టికి జిల్లా ఎస్సి ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి తిరుమలేష్ తీసుక పోవడంతో కలెక్టర్ గారు ఈ నెల 1 నుండి ఇందిరానగర్ లో కూడా రేషన్ సరుకులు అందచేయ్యాలని సంబంధిత శాఖ DCSO, MRO లకు ఆదేశాలు జారీ చెయ్యడంతో వారు రేషన్ షాప్ పాయింట్ కాలనీ ప్రజల సౌకర్యర్థం కాలనీ ప్రజల సూచనతో కాలనీ మధ్యలో ఏర్పాటు చేయించి నేడు తహసీల్దార్ జ్యోతి చేతుల మీదుగా ప్రారంభించిన అనంతరం కాలనీ ప్రజలు వృద్ధులు వికలాంగులు సంతోషం తో నిరంతరం ప్రజా శ్రేయస్సుకోసం పనిచేస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంతరావు చిత్ర పటానికి పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సి ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి తిరుమలేష్, ఇంచార్జ్ రేషన్ డీలర్ గార్లపాటి లక్మయ్య, గడ్డం నర్సింహా, కందుకూరి బిక్షం, దాసరి నరేష్, జిట్ట సాయి కుమార్, కందుకూరి ప్రకాష్, గడ్డం రమేష్,కందుకూరి మురళి, దాసరి కనుకయ్య, గడ్డం స్వామి, దాసరి నవీన్ కుమార్, దాసరి యాదయ్య, జిట్ట లక్మయ్య, కందుకూరి నర్సయ్య, కొంపెల్లి నర్సింహా, వంగాల యాదగిరి, జిట్ట మల్లేష్, దాసరి నర్సింహా, గడ్డం మల్లేష్, వంగాల ముత్తయ్య, బుశిపాక సత్తయ్య, పందుల యాదగిరి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.