షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన

★డాక్టర్ పాపారావు అదనపు జిల్లా వైద్య అధికారి ★డాక్టర్ వి .విజయలక్ష్మి ★డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ

సాక్షి డిజిటల్ న్యూస్ /Nov01/ ఫరూక్ నగర్*రిపోర్టర్ కృష్ణ, ఈరోజు ఉదయము షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐ.సి.టి.సి (ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్) ను, క్షయ పరీక్ష ల్యాబ్ ను, జనరల్ ల్యాబ్ ను మరియు పి.పీ యూనిట్ ను , డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. ఐ సి టి సి సెంటర్లో , జనరల్ పేషెంట్ల పరీక్ష రిజిస్టర్ ను మరియు గర్భవతులకు నిర్వహించే పరీక్ష యొక్క రిజిస్టర్ ను , పరిశీలించారు. క్షయ వ్యాధి ల్యాబ్ లో నిర్వహించే పరీక్షలను పరిశీలించి, క్షయ వ్యాధి సూపర్వైజర్ యొక్క రిజిస్టర్ ను పరిశీలించి , రిజిస్టర్లో అందరి పేషంట్ల యొక్క వివరాలను ఎప్పటికప్పుడు ఎంటర్ చేయాలని హెచ్చరించారు. క్షయ వ్యాధి నీ పరిశీలించే ల్యాబ్ లోని రిజిస్టర్లను, ప్రతి వారము పరిశీలించాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి గారికి తెలియజేశారు. తదుపరి షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని జనరల్ ల్యాబ్ లో నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించి సిబ్బందిని మెచ్చుకున్నారు. తదుపరి పి.పి యూనిట్ యొక్క సిబ్బందితో మాట్లాడుతూ, వారి యొక్క విధి నిర్వహణలో నిర్వహించే ప్రోగ్రామ్ యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ఔట్రిచ్ ఏరియాలో వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం చేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జే.శ్రీనివాసులు, ఐ సి టి సి కౌన్సిలర్ శ్యాంసుందర్, క్షయ వ్యాధి సూపర్వైజర్లు షఫీ, రవికుమార్ , ల్యాబ్ టెక్నీషియన్ సలాం ఖాన్, మరియు పి.పి యూనిట్ సిబ్బంది స్టాఫ్ నర్స్ వినీత, రవి కుమార్ మరియు ఆశాలు ఈ కార్యక్రమంలో ఉన్నారు.