వైభవంగా ప్రారంభమైనకార్తీక ఏకాదశి ఉత్సవాలు

★భగవాన్ నామ సంకీర్తన ఏకాహాలు ప్రారంభం

సాక్షి డిజిటల్ న్యూస్,కామేపల్లి (నవంబర్ 1) : శివునికి ప్రీతి పాత్రమైన కార్తీక మాసం ఏకాదశి ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. కామేపల్లిలోని బాలత్రిపుర సుందరి ఇష్టకామేశ్వరి స్వామి దేవాలయ ప్రాంగణంలోని గురు మందిరంలో ఉత్సవాలును అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు చేరుకొని శివునికి అభిషేకాలు జరిపారు.ఈ సందర్భంగా శివునికి పంచామృత అభిషేకాలు,విశేష పూజలు,మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం గతయ ఎనిమిది దశాబ్దాలుగా నిర్వహిస్తున్న హరే రామ నామ భగవన్నామ సంకీర్తన భక్త మండ లి అధ్యక్షులు గోట్టుపర్తి శివాజీచే వేడుకలు ప్రారంభమయ్యాయి.అదే విధంగా ఆదివారం నాడు శివనామ సంకీర్తన ఏకాహు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అర్చకులు సాయి రామకృష్ణ నరసింహ శర్మ, దమ్మలపాటి శివాజీ,కేశగాని నాగయ్య,డాక్టర్ పూజల శివకృష్ణ, నరసింహా రావు,పెరుగు సైదులు, ఐలయ్య,మనోజ్ కుమార్,నాగేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.