వావ్… వాట్ వాట్సాప్ గ్రూప్….! కుటుంబాన్ని ఆదుకున్న చాటింగ్

సాక్షి డిజిటల్ న్యూస్:తేది: నవంబర్ 1మండలం: కారేపల్లిజిల్లా: ఖమ్మంరిపోర్టర్: హాట్కర్.రాంబాబువాట్సాప్ గ్రూప్ అంటే ఎలా ఉంటుంది ఆ గ్రూప్లో ఉన్న చెత్త ఈ గ్రూపులో ఇందులో ఉన్నది అందులోకి… ఇలా ఫార్వర్డ్ మెసేజ్ లే ఎక్కువగా ఉంటాయి. మహా అయితే గుడ్ మార్నింగ్ హాయ్ అని చాటింగ్ లు ఉంటాయి. పేపర్ క్లిప్పింగ్ లు యూట్యూబ్ లింకులు ఎడతెగకుండా పేడుతూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే నేటి వాట్సాప్ గ్రూప్ ఓ డప్పింగ్ యాడ్ ల మారుతున్నాయి అనడంలో సందేహం లేదు. కానీ ఓ గ్రామ వాట్సాప్ అందుకు భిన్నంగా రన్ అవుతుంది. గ్రామంలో పుట్టి పెరిగి పెళ్లిళ్ళై కొంతమంది ఉద్యోగరీత్యా మరి కొంతమంది సొంత ఊరుకు దూరంగా ఉంటున్నారు. వారంతా కలిసి గ్రామ విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన ఊరు హెల్పింగ్ హాండ్స్ వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసుకున్నారు. దానిలో చెత్తను పోగు చేయకుండా అవసరాలు అనుబంధాలు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ గ్రూపులో వచ్చిన విషాద మెసేజ్ గ్రూప్ సభ్యులను కలిసి వేసింది. తమ మిత్రుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని భార్యను ఇద్దరు చిన్నారులను అనాధలను చేసి వెళ్ళాడని కలత చెందారు. వెంటనే ఆ కుటుంబానికి బాసటగా నిలవాలని ఆర్థిక చేయూత అందచేయాలని మన ఊరు హెల్పింగ్ హ్యాండ్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఆకున్నదే తడువుగా 35000 రూపాయలు అందించి ఆదర్శంగా నిలిచారు. మానవత్వం నిండిన ఈ సంఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పరిధిలోని బొక్కల తండా గ్రామంలో20.10.2025 మంగళవారం జరిగింది. బొక్కలతండా గ్రామానికి చెందిన మాలోత్ నరేష్ బతుకుదెరువు కోసం ఆక్వా గార్డ్ జీవనం సాగిస్తుండగా కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు ఈ ఆకస్మిత ఘటనతో భార్య విజయ కూతురు చైతన్య కుమారుడు హిమాన్షు భవిష్యత్తు అందాకారంగా మారింది. స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని మన ఊరు హెల్పింగ్ హాండ్స్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు భావించారు. తమకు సాధ్యమైనంత మేర డబ్బులు జమ చేసి గురువారం నరేష్ భార్యకు అందజేశారు. సభ్యులతో పాటు ఆయన శ్రేయోభిలాషుల సహకారంతో లక్ష్యం… -లక్ష కార్యక్రమాన్ని చేపట్టారు విజయవంతంగా పూర్తి చేశారు గ్రూపులోని ఒక్కొక్కరు 500 నుంచి 5000 వరకు సాయం చేశారు మొత్తం 35000 వసూలు చేసి పిల్లల చదువుకు అవసరాల దృష్ట్యా గురువారం నరేష్ సతీమణి విజయకు నగదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ హాట్కార్. రాంబాబు, అజ్మీర కుమార్, ధారావత్ సుమంత్, అజ్మీర కృష్ణ, అజ్మీర తిరుపతి, అజ్మీర రాంబాబు, అజ్మీర పవన్, ఆంగోత్ వినోద్, భానోత్ ఆదిత్య భూక్య సురేష్, వాంకుడోత్ వీరన్న(టిల్లు), అజ్మీర అంకుష్, హాట్కార్. అరవింద్, హట్కర్ లోకేష్, హాట్కర్ శ్రీహరి, హాట్కార్. లక్ష్మణ్, హట్కర్ భరత్, వాంకుడు వీరన్న (మాన్య ), వాంకుడోత్ రాంబాబు(కేవుళ్య), వాంకుడోత్ వెంకన్న, అజ్మీర్ బావుసింగ్, అజ్మీర రంగారావు, బానోత్ అశోక్, అజ్మీర అజయ్ జరపల మధు హట్కర్ సందీప్, వాంకుడోత్ ప్రసాద్ బాబు, లాకవత్ కోటేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *