సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 1 ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ ప్రజాసామ్య విద్యార్ధి సంగం పి డి ఎస్ యు గత 50 సంవత్సరాలుగా విద్యార్థుల హక్కుల కోసం సమసమాజ స్థాపన కోసం నాణ్యమైన విద్యను అందరికీ అందాలనే ఉద్దేశంతో అమరత్వం పొందిన ఈ విప్లవ సంఘం ఈరోజు 23 రాష్ట్ర మహాసభలను డిసెంబర్ 10,12,13 తేదీలలో వరంగల్ ఉద్యమ జిల్లా కేంద్రంగా చెప్పుకునే ఉద్యమ కిల్లాలో వరంగల్ ఉద్యమ గడ్డపై జరుపుతా ఉందనీ ప్రగతిశీల ప్రజాస్వామ్య పి డి ఎస్ యు విద్యార్థి సంఘం అన్నారు. ఈ సందర్భంగా ధర్పల్లి మండలంలో ప్రగతిశీల ప్రజాస్వామ్యం ఆర్మూర్ డివిజన్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 50 సంవత్సరాల క్రితం ఈ దేశంలో అసమానతలు పోవాలని సమ సమాజం ఏర్పడాలని పి డి ఎస్ యు విద్యార్థి సంఘం అనేక పోరాటాలు చేస్తుందని అన్నారు . నాణ్యమైన విద్య కోసం అనేక అమరత్వాలు విజయాలు పి డి ఎస్ యు విద్యార్థి సంఘం చేస్తుందని గుర్తు చేశారు. రాష్ట్ర మహాసభలకు విద్యార్థుల సభ్యత్వం తీసుకోవడం జరిగిందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర మహాసభలకు ప్రగతిశీల సంఘాలు,మేధావులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. మండలాలు జిల్లాలు రాష్ట్రవ్యాప్తంగా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి పి డి ఎస్ యు విద్యార్థి సంఘాల పనితీరును రాష్ట్ర మహాసభల పిలుపును తెలియజేస్తున్నామని అన్నారు.