రైతాంగం పరిస్థితిపై భాజపా రాష్ట్ర అధ్యక్షునికి మెమోరాండం అందజేసిన ఆపతి వెంకట రామారావు

★తుపాన్ కారణం గా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలని బీజేపీ నాయకుల డిమాండ్

సాక్షి డిజిటల్ న్యూస్ 2సెప్టెంబర్ 2025 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు నారపనేని రామచంద్రరావు గారు నిన్న కురిసిన మెుంథా తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు ఖమ్మం జిల్లా పర్యటనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తల్లాడ మండల బీజేపీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులను ఖమ్మంలో కలిసి, జిల్లాలోని వ్యవసాయ పరిస్థితి మరియు తల్లాడ మండలంలో నష్టపోయిన రైతాంగం పరిస్థితి గురించి వివరించారు. రైతులు భారీగా నష్టపోయిన పంటల పరిస్థితిని వివరించిన అనంతరం, తక్షణమే ప్రభుత్వంచే రైతాంగానికి తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ మెమోరాండంను అధ్యక్షులకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మెుంథా తుఫాను వలన పంటలు నాశనమై రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ప్రభుత్వం తక్షణమే పంట నష్టం అంచనా వేయించి, రైతులకు ఆర్థిక సాయం అందించాలి” అని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో మాజీ బీజేపీ మండల అధ్యక్షులు ఆపతి. వెంకట రామారావు, గాదె. క్రిష్ణ రావు, పెరిక. కిరణ్ గౌడ్, వాడవల్లి. నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.