సాక్షి డిజిటల్: నవంబరు 1 అశ్వరావుపేట ఇంచార్జ్, బుల్లా శివ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాసన్నపేట గ్రామంలో రోడ్డు మార్గం లేక గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు.కంటే కేశవ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఆ గ్రామంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి రోడ్డు లేక అత్యవసర పరిస్థితుల్లో అనేక అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఆయన మాట్లాడుతూ ప్రజలకు అనారోగ్యం లేదా జ్వరాల బారిన పడితే రహదారి లేక సరైన సమయంలో ట్రీట్మెంట్ అందక ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ రోడ్డు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే రోడ్డురు నిర్మించాలని లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాన్ని ముట్టడించి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముందు ఉంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వూకే.ముత్తయ్య దొర . ములకలపల్లి జెడ్పిటిసి. అభ్యర్థి. వూకే. నాగేశ్వరరావు పూనెం.నరేష్.కల్లూరి . రాణి. ఆలెం వెంకటేశ్వర్లు ప్రేమ్ దయాళ్.ఆయన వెంట ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు