సాక్షి డిజిటల్ న్యూస్ హొళగుంద నవంబర్ 1 హొళగుంద మండల పరిధిలోని హెబ్బటం, పెద్ద గోనెహల్ ఇంగళదహల్ గ్రామలలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చ బండ కార్యక్రమన్ని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి నిర్వహించారు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైస్సార్సీపీ పార్టీ అధికారం ఉన్నపుడు ప్రజల కు ఇంటి వద్దకే సేవలు అందించడనికి వాలంటీర్స్ వ్యవస్థ ను ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు సచివాలయం చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది వారు పేర్కొన్నారు నేను ఎమ్మెల్యే గా గెలిచినప్పటి నుంచి హొళగుంద నుండి ఢణపురం రోడ్డు అధ్వానంగా ఉందని, రోడ్డు వేయాలని జిల్లా అధికారులకు చాలా సార్లు వినతి పత్రం మరియు ధర్నాలు చేసిన కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ వారు అన్నారు ఈ కూటమి ప్రభుత్వం విద్య వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నరని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటికరణ చేస్తూ పేదలకు వైద్యం అందకుండా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం నేర్పే రోజులు దగ్గర ఉన్నాయని వారు తెలియజేశారు పి పి పి విధానాన్ని రద్దు చేసేందుకే కోటిసంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వారు తెలిపారు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించి పి పి పి విధానాన్ని రద్దు చేసే వరకు ప్రతి ఒక్కరూ పోరాడాలని వారు సూచించారు విధానాన్ని రద్దు చేయకపోతే భవిష్యత్తులో రోగాలకు బాధపడిన వారు లక్షల్లో డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు తెలిపారు కేంద్రం ప్రభుత్వం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పిందని అన్నారు పి పి పి విధానాన్ని రద్దు చేసేంతవరకు, పార్టీలకు అతీతంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి వారు పిలుపునిచ్చారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేయకూడదని ఈనెల 11వ తేదీన ఆలూరు లో ప్రైవేటీకరణ చేయకూడదని భారీర్యాలీ చేయడం జరుగుతుందనీ ఈ ర్యాలీకి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున రావాలని ఎమ్మెల్యే విరుపాక్షి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, షఫీ ఉల్లా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ శేషప్ప మూడు గ్రామాల సర్పంచులు కొత్త ఇంటి వెంకటరెడ్డి వెంకటరామిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కేగిరి వైఎస్ఆర్సిపి నాయకులు ప్రహల్లాద రెడ్డి మల్లికార్జున రఫీక్ మోనేష్ శంభో వెంకటగిరి ఎంపీటీసీలు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బి వి ఆర్ అభిమానులు పాల్గొన్నారు.
