సాక్షి డిజిటల్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం స్టాఫ్ రిపోర్టర్ రాము నాయక్ (నవంబర్ :2 ) ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి కోల్పోయిన ఎస్సీ కులాలను ప్రభుత్వo గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులును హైదరాబాద్ ఆయన నివాసంలో శనివారం షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాటం సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధిలో వెనకబడ్డ ఎస్సీ కులాలకు భారత రాజ్యాంగ పరమైన హక్కులు అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. రోజు రోజుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల అభివృద్ధికి దూరం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.స్వతంత్రానికి పూర్వం జీవించినట్టుగానే ఏజెన్సీ ప్రాంత ఎస్సీల బతుకులు అంధకారములో ఉన్నాయన్నారు. ఎటువంటి హక్కు దిక్కు లేకుండా ఓటు హక్కుకే పరిమితం చేశారని వాపోయారు.దళితుల్లో ఎదిగిన నాయకత్వం ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని సంబంధిత రాష్ట్ర మంత్రులకు నాయకులకు పార్టీలకు అధికారులకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నామని వివరించారు.పేద ప్రజలపై అవగాహన ఉన్న మాజీ మంత్రిగా సమస్య ను దృష్టిలో ఉంచుతున్నామని తెలియజేశారు.స్పందించిన మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు మీ ఉద్యమానికి నా మద్దతు ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్ తదితరులు ఉన్నారు.