సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 1 భద్రాచలం రిపోర్టర్ గడ్డం సుధాకర్ రావు; భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో మద్యం పాలసీని రద్దు చేయాలని ఈ ప్రాంతానికి మద్యం దుకాణాలను లైసెన్సు ఇచ్చే ఆలోచన విరమించుకోవాలని జిల్లా కలెక్టర్ చొరవ చూపి ఈ ప్రాంతానికి జరిగే నష్టాన్ని ప్రభుత్వానికి వివరించాలని మహా జన సమితి ఆదివాసి మహిళ రాష్ట్ర కన్వీనర్ కంగాల రమణకుమారి జిల్లా కలెక్టర్ ని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో మద్యం అమ్మకాల వలన యువకులు చెడు మార్గం పడుతున్నారని హత్యలు గ్యాంగ్ వార్లకు మద్యం కారణం గా ఉందని అనేక యాక్సిడెంట్లు మద్యం వలన జరుగుతున్నాయని ఎక్కువ శాతం ఆదివాసి యువకులు ఈ మధ్యనికి బలవుతున్నారని ఆమె పేర్కొన్నారు అంతేకాకుండా మద్యం లైసెన్సు గిరిజన ల పేరు మీద పొంది గిరిజనేత్రుల బడా వ్యాపారస్తులు వ్యాపారం చేస్తూ విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులను ఏర్పాటు చేసుకొని సిండికేట్ చీకటి వ్యాపారాన్ని కొనసాగి స్తున్నారని ఆమె తెలిపారు పెస చట్టం ప్రకారం గ్రామసభ పిఓ ఆధ్వర్యంలో నిర్వహించట్లేదని ఎవరికీ నచ్చినట్లు వాళ్లు స్థానిక అధికారులు వ్యవహరిస్తూ చట్ట ఉల్లంఘన జరుగుతుందని ఆమె అన్నారు కొంతమంది ముడుపుల కోసం చట్టవుల్లంఘన జరుగుతున్న పట్టించుకోవట్లేదని ఎవరికి అంది మూట వాళ్లకి అందటం వలన ఎవరు కూడా ఈ ప్రాంతంలో నోరు మెదపడం లేదని ఆమె అన్నారు ఎక్సైజ్ అధికారులు కూడా ఈ విషయంపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదని వీటిని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ ఈ ప్రాంతంలో అనేక అలజడలకు హత్యలకు గొడవలకు అరాచకాలకు మధ్యమే ప్రధాన కారణమని ప్రభుత్వానికి తెలియజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా ఈ ప్రాంతం ప్రత్యేకమైన ప్రాంతమని భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి కొలువుతీరిన ప్రాంతంగా చెప్పుకుంటారని దక్షిణ అయోధ్యగా ఈ ప్రాంతాన్ని పిలుస్తున్నారని ఇటువంటి ఘన కీర్తి ఈ ప్రాంతానికి ఉందని మద్యం మహమ్మారి వలన వస్తున్న భక్తులకు కూడా ఆటంకం వాటిల్లుతుందని ఆదివాసుల చట్టాలు నీరు కారుస్తున్నారని తక్షణమే ఈ ప్రాంతానికి మద్యం పాలసీని రద్దుచేసి సస్యశ్యామలంగా ఈ ప్రాంతాన్ని కాపాడాలని విద్యార్థులు యువకులు మద్యం బారిన పడకుండా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి కాపాడాలని ఆమె జిల్లా కలెక్టర్ కి విన్నవించారు