సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 1.2025 రిపోర్టర్ కొత్తపల్లి గోరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా యాట క్రిష్ణ గోరి కొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన జానపద కళాకారుల సంఘం జిల్లా నాయకులు నిమ్మల రాజు తల్లి గారు క్రీ.శే నిమ్మల రాజక్క గారు ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు సూరం వీరేందర్ శనివారం స్థానిక నాయకులతో కలిసి, రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం కల్పించారు. అలాగే 50కేజీల బియ్యం అందించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం ఆయన ఇటీవల మండల కేంద్రంలో మరణించిన రాచర్ల కాంతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్ధిక సహాయం అందజేసి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైనాల ప్రభాకర్, ఈర్ల శ్యామ్, సాదు బిక్షపతి, తోట రామకృష్ణ, దుమాల అంకుస్, గోనె ప్రకాష్, దుమాల కిషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.