ప్రమాదానికి అసలు కారణం ఇదే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

పయనించే సూర్యుడు : శ్రీకాకుళం కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటకు ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. 2వేల మంది భక్తులకు మాత్రమే సరిపోయే ఆలయంలో 25 వేల మంది భక్తులకు అనుమతి ఇవ్వడంతోనే ప్రమాదం జరిగిందని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్నదని.. దేవాదాయ శాఖకు గానీ ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదని మంత్రి ఆనం స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్టకర ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. సుమారు 2000 మందిని మాత్రమే పట్టే ఈ దేవస్థానానికి ఒక్కసారిగా 25 వేల మంది భక్తులు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రైవేట్ వ్యక్తులు ఎటువంటి సమాచారం ప్రభుత్వానికి లేదా దేవాదాయ శాఖకు అందించలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.