సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 1 భద్రాచలం రిపోర్టర్ గడ్డం సుధాకర్ రావు; ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాచలం పట్టణo లో రాష్ట్ర ప్రభుత్వా విధానాలను నిరసిస్తూ ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భిక్షాటన చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల రవీందర్ మాట్లాడుతూ ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి కాలేజీలలో 8 వేల కోట్లకు పైగా స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులను కాలేజీ యజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కనీసం విద్యార్థుల సమస్యలపై స్పందించే అవకాశం లేదా? ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చూస్తున్నాం అని అన్నారు. మా ఫీజులు మాకు చెల్లించండి అని విద్యార్థులు 31వ తారీకు బంద్ నిర్వహించగా విద్యాసంస్థలపై విజిలెన్స్ దాడులు చేస్తామని బెదిరించటం దుర్మార్గపు చర్య అని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. ముగ్గురు మంత్రులు ఉన్నా ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో కనీసం విద్యార్థుల సమస్యలు తీర్చేందుకు ఆలోచన కూడా చేయట్లేదు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు అని కొప్పుల రవీందర్ అన్నారు. తక్షణమే స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేశారు. లేనియెడల ఎమ్మెల్యే ఇళ్లను మంత్రుల ఇళ్ళను ముట్టడిస్తామని అలాగే ఐ టి డి ఎ పిఓ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం లను ముట్టడి చెయ్యటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ఫీజు స్కాలర్షిప్స్ రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలి సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఫీజులను డిమాండ్ చేస్తూ వసూళ్లు చేస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని రవీందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం చందు వర్ధన్,భరత్,సాయికుమార్ ,రమ్య ,స్వాతి, సుమ, కావ్య శ్రీ, మేఘన, తదితరులు పాల్గొన్నారు.