సాక్షి డిజిటల్ న్యూస్,నవంబర్ 01,రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఒకటి,రెండు ఆధ్వర్యంలో సిరిపురం,ఎల్లంకి గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రత్యేకశిభిరంలో శనివారం నాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ,పల్లెప్రకృతి వనం,డంప్ యార్డ్ వద్ద మొక్కలు నాటడం జరిగినది.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు మిర్యాల అనిత, తాటిశెట్టి శ్రీనివాసులు, అధ్యాపకులు డాక్టర్ బ్రహ్మం, అమర్,ఆంజనేయులు,నరేష్,సెక్రటరీ జ్యోతి,వాలంటీర్లు సురేష్,మహేష్,ఖాసీం ఖాన్,శ్రీనివాస్,నాని,భరత్ చంద్ర,శివమణి,సమీర్, వినయ్,ప్రశాంత్,కార్తీక్,రాజు,మధు,నవీన్,ప్రవీణ్,అజయ్,రేష్మా,మనీషా,వరలక్ష్మి,అస్రా అంజూ,ధరణి,పూజ,చాందిని తదితరులు పాల్గొన్నారు.