సాక్షి డిజిటల్ న్యూస్ 1 నవంబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు బడుగు బలహీన వర్గాల పేద ప్రజల మద్దతు తో కూటమి పాలన వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని మాజీ డిప్యూటీ సీఎం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా సంఘం సభ్యులు బూడి ముత్యాల నాయుడు ద్వజమెత్తారు ఎంపీపీ సర్పంచ్ చింతలబుల్లి లక్ష్మీ చింతల వెంకటరమణ ఆధ్వర్యంలో మండలంలోని ఏ కొత్త పల్లి గ్రామంలో శనివారం కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పేద వైద్య విద్యార్థులకు అభ్యున్నతికి విద్యా వైద్యం అందించాలని దృఢ సంకల్పంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజ్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పేద విద్యార్థులువైద్య అభ్యసించకూడదనే దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం కాలేజీలను రద్దు చేసే దిశగా పావులు కదుపుతుందని ఆయన విమర్శించారు కూటమి దుశ్చర్యలను అన్యాయాలను ప్రజలకు వివరిస్తూ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు అనంతరం రచ్చబండ వద్ద ప్రజలతో సమావేశమై కూటమి నాయకులు చేస్తున్న కుటిల రాజకీయాలను వివరించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కరిసత్యం మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు ఆ పార్టీ సీనియర్ నాయకులు పండూరి నాయుడు పెద్దాడ ఈశ్వరరావు కంచిపాటి వెంకటరమణ లక్కరాజు పెద్ది నాయుడు విద్యార్థులు మహిళలు పాల్గొన్నారు