పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో యోగ,ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెమినార్.

★ముఖ్య అతిథిగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు అరవింద్ గోయల్,పట్టాభి రామారావు.

సాక్షి డిజిటల్ న్యూస్:1 నవంబర్,పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండల పరిధిలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో శనివారం ఆర్ట్ ఆఫ్ లివింగ్,యోగపై సెమినార్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పోలారపు పద్మ మాట్లాడుతూ,మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగ,ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవసరమని,విద్యార్థులు యోగతో చదువుపై శ్రద్ధ పెంచుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని తెలిపారు.అరవింద్ గోయల్,పట్టాభి రామారావు మాట్లాడుతూ,యోగ మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.వాటి ద్వారా మానసిక ప్రశాంతత,ఒత్తిడి లేని జీవితం,మంచి ఆరోగ్యం లభిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.