పంచాయితీ నిధులు స్వాహా చేసినవారికి కఠిన చర్యలు తప్పవు

★పెద్దగొనేహళ్ గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టిన డిఎల్పిఓ తిమ్మక్క

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద నవంబర్ 1 పంచాయతీ నిధులు స్వాహా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని డిఎల్పిఓ తిమ్మక్క అన్నారు ఈ సందర్భంగా శనివారం మండల పరిధిలోని పెద్ద గోనెహాల గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టినట్లు వారు తెలిపారు అనంతరం పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచుల పై విచారణ చేసి ఈ నివేదికను జిల్లా ఉన్నత అధికారులకు పంపించి శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోని పరిశుభ్రత త్రాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి శుభ్రత డ్రైనేజీ క్లీనింగ్ పై ప్రత్యేక దృష్టి సాధించాలని ఆమె కార్యదర్శులకు సూచించారు లక్షల్లో స్వాహా చేసిన సర్పంచ్కు పంచాయతీ కార్యదర్శి ఆరోపణలు నిజమైతే ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిఓపిఆర్డి చక్రవర్తి పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ షఫీ రాజ్ కుమార్ గ్రామస్తులు వెంకట రాముడు తదితరులు పాల్గొన్నారు