సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ : 1 నవాబుపేట్ మండలం అంధకారంలో నాలుగో వార్డ్ ” పంచాయతీ పాలకులు అధికారుల నిర్లక్ష్యం మూలంగా గ్రామం లో నాలుగో వార్డు. వాసులు అంధకారంలో మగ్గుతున్నారు. విద్యుత్ స్తంభాలపై వెలుగు ఇవ్వని వీధి దీపాలు చీకటిలో బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. కాలనీవాసులు నిత్యం ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అధికారుల దృష్టికి సమస్య తీవ్రతను పలుమార్లు తీసుకొచ్చి నప్పటికి ఫలితం కనిపించడం లేదని వాపోతున్నారు. రాత్రిపూట తిరగాలంటే ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు చీకటిని ఆసరాగా చేసుకుని అసాంఘిక చర్యలు జరిగే ప్రమాదం ఉందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రతకు సంబంధించి చిన్న సమస్యలు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చని, అంటున్నారు వీధి దీపాలు వెలగక చీకట్లో లింగంపల్లి గ్రామ ప్రజలు సీసీ కెమెరాలు ఉన్నా స్పష్టత లేక భద్రతావ్యవస్థ.దెబ్బతింటుందని గ్రామస్థుల ఆవేదన, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. గ్రామాల్లో రాత్రిపూట వీధి దీపాలు వెలగక పోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు; గ్రామ భద్రతను మెరుగుపర్చడానికి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన వీధి దీపాలు లేక పనిచేయకపోవడంతో రాత్రివేళల్లో దొంగతనాలు, ఇతర అసాంఘిక చర్యలు జరుగుతున్నాయేమోనన్న భయంతో ప్రజలు జీవిస్తున్నారు. రాత్రిపూట లైట్లు వెలగక రోడ్లపై నడవాలంటే భయంగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు; పంచాయతీ అధికారుల దృష్టికి సమస్యను పలుమార్లు తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు. వీధి దీపాల నిర్వహణ గ్రామ పంచాయతీల బాధ్యతగా ఉన్నా, కొన్నిచోట్ల నిర్లక్ష్యం కారణంగా పాడైన బల్బులు, విద్యుత్ సరఫరా లోపాలు సకాలంలో సరిచేయడం జరగడం లేదని ప్రజలు అంటున్నారు; గ్రామ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా లైట్లు వెలగకపోవడంతో స్పష్టమైన దృశ్యాలు రికార్డు చేయలేక పోతున్నాయని చెప్పారు. ఇది నేరాల నివారణకు ఆటంకంగా మారుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు; గ్రామ పంచాయతీ అధికారులు సమస్యను గమనించి, వీధి దీపాలు మరమ్మతులపై తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు
