నవంబర్ 01, సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ జగన్, సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల కేంద్రమైన వేంసూరు గ్రామం లో తెలంగాణ రాష్ట్రo ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను శనివారం నాడు సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఏటువంటి ఇబ్బందులు తలెత్త కుండా ముందు గానే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సన్న రకం కు రైతులకు ప్రభుత్వ బోనస్ 500/- రూపాయలు అందిస్తుందని తెలిపారు. సన్న రకం క్వింటాకు 2,389/- రూపాయలు, దొడ్డు రకం క్వింటాకు 2,369/- రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టికి, రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మలకి, పొంగులేటికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఎంఆర్ఓ మాణిక్ రావు, ఎంపీడీఓ, ఏఓ రాంమోహన్, ఏపీఎం, ఏఈవో, ప్రభుత్వ అధికారులు, వేంసూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్ర శేఖర్ రెడ్డి, వేంసూరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
