దుగ్గరాజపట్నం పోర్టుకి చంద్రబాబే అడ్డంకి !

*కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 1 కోట మండలం, తిరుపతి జిల్లా: దుగ్గరాజ పట్నం పోర్ట్ రాకపోవడానికి ప్రధాన అడ్డంకి చంద్రబాబే అని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు. శనివారం కోటలో డాక్టర్ అంబేద్కర్ బొమ్మ దగ్గర ఆయన మీడియాతో మాట్లాడారు. 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ దుగ్గరాజపట్నం పోర్టును తీసుకురావడం జరిగిందన్నారు. పోర్టువల్ల ఈ ప్రాంత యువకులకి, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలతో ఉపాధి దొరికేదన్నారు. చెన్నై, విశాఖపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల కంటే తూపిలిపాలెం సముద్రం లోతైనదని దుగ్గరాజపట్నం ఓడరేవు త్వరగా అభివృద్ధి చెందేదన్నారు. చంద్రబాబు నాయుడు కుట్రతో ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడానికి కేంద్రానికి లేఖలు రాసి ఆపేశారన్నారు. ఈ పాపం ఊరకే పోదని చంద్రబాబుకు శాపమై తగులుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కోటీశ్వరులప్రభుత్వమని..పరిశ్రమల పేరుతో సుందర్ పిచ్చయ్యకు 22 వేల కోట్లు మాఫీలు చేయడం ఏమిటని ఇది వచ్చి దుర్మార్గం అన్నారు. బ్యాంకుల నుంచి 14 లక్షల కోట్లు రుణాలు పొంది కోటీశ్వరులకు రుణమాఫీ చేశారని కానీ ఆ స్థాయిలో రైతులకు మాత్రం మేలు జరగడం లేదన్నారు. పేదలకు మేలు చేసే ప్రభుత్వo ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు.అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎరువులు, సబ్సిడీలు సకాలంలో అందించేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల కళ్ళల్లో నీరు పెట్టిస్తుందన్నారు. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ 20 సూత్రాల పథకాన్ని దేశం మొత్తం అమలుపరచి పేదలకు బడుగులకు న్యాయం చేసిందన్నారు. మోడీ, చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శంకర్రావు, ప్రసాద్, ఖాదర్, శ్రీనివాసులు, దయాకర్, ధనుంజయ ,సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *