సాక్షి డిజిటల్ న్యూస్/ నవంబర్ 1/తల్లాడ తల్లాడ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహించిన జేవియర్ పదవీ విరమణ కార్యక్రమం శుక్రవారం రాత్రి తల్లాడ పోలీస్ స్టేషన్ లో చేపట్టారు. ఈ సందర్భంగా తల్లాడ ఎస్సై-2 వెంకటేష్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో జేవిఆర్ దంపతులను శాలువాలు, పూలమాలలతో సన్మానించి సత్కరించారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ జేవియర్ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేశారని గుర్తు చేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సిబ్బంది పనిచేయాలని సూచించారు. పదవీ విరమణ ఉద్యోగంలో భాగమైనప్పటికీ ఎవరైనా చేయాల్సిందేనని, ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తల్లాడ హెడ్ పోలీస్ కానిస్టేబుల్ చెన్నారావు , శశిధర్, వెంకటేశ్వరావు, కానిస్టేబుల్ శ్రీనివాసరావు, మురళీ, రామక్రిష్ణ, రంజిత్, హరి, నరేష్, రాధాకృష్ణ, పాల్గొన్నారు.