సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 1, తంబల్లపల్లి మండల రిపోర్టర్ ఇ. రమేష్ బాబు. తంబళ్లపల్లె మండల పరిషత్ డిప్యూటీ ఎంపీడీవో గా ఎం.వి ప్రసాద్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆయన అనంతపురం జిల్లా గుత్తి నియోజకవర్గం కరిడికొండ గ్రేడ్ వన్ కార్యదర్శిగా పనిచేస్తూ పదోన్నతి పై తంబళ్లపల్లె డిప్యూటీ ఎంపీడీవో గా బదిలీపై ఇక్కడికి వచ్చారు. డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ ను ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ నాయక్, టైపిస్ట్ సురేంద్ర, జూనియర్ అసిస్టెంట్ విజయ్, కార్యదర్శిలు ఈశ్వర్ రెడ్డి, శ్రీనివాసరావు లు ఘనంగా సన్మానించి స్వాగతించారు. డిప్యూటీ ఎంపీడీవో అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ తంబళ్లపల్లె మండల అభివృద్ధికి కార్యాలయ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకుల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.