డాటా ఎంట్రీ పై శిక్షణ

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 1 భూమయ్య రిపోర్టర్ పిట్లం మండలం పిట్లం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిట్లంలో యుడైస్ ప్లస్ లో డాటా ఎంట్రీ పై శిక్షణ కార్యక్రమం మండల విద్యాధికారి దేవి సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మండల విద్యాధికారి మాట్లాడుతూ పాఠశాల యొక్క పూర్తి సమాచారం ఆన్లైన్ యు డైస్ లో పొందుపరచాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్పి శ్రీధర్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ అశోక్, సీఆర్పీ హైమద్ పాషా లు డి సి ఎఫ్ ఆన్లైన్లో పూర్తి చేసే విధానంపై పూర్తి అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలలు ప్రభుత్వ ,ప్రైవేటు, కేజీబీవీ రెసిడెన్షియల్ ,జూనియర్ కళాశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఆపరేటర్లు పాల్గొన్నారు .