సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 01, రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మరమ్మత్తుల కొరకు నిధులు మంజూరు అయినట్టు చెన్నూరు ఎమ్మెల్యే,రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు రోడ్లు, నీటి సరఫరా, ప్లంబింగ్,అవసరమైన ఇతర మరమ్మత్తుల కొరకు నిధులు మంజూరు చేయించినట్లు, ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో తక్షణం సదుపాయాలు అందేలా చొరవ తీసుకుంటున్నామని, త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్లల్లోకి వెళ్లేలా అన్ని రకాల సదుపాయాలు అందేలా చూస్తామని అన్నారు.