సాక్షి డిజిటల్ న్యూస్ 2 నవంబర్ 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (షేక్ గౌస్ సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి ) ఎన్నికల్లో భాగంగా బా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రుడు చంద్రశేఖర్ తో కలిసి కాంగ్రెస్ నాయకులు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని షేక్ పేట్ డివిజన్ 24వ బూత్ ఓయూ కాలనిలో ఇంటింటా ప్రచారం చేసినట్లు మైనార్టీ నాయకులు షేక్ నిస్సార్ తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రభుత్వ పథకాలకు మద్దతు ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు పంపిణీ, సన్న బియ్యం పథకంతో పాటు వివిధ పథకాలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి చేయడం జరిగిందని, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు హస్తం గుర్తు పైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేశారు. నవీన్ యాదవ్ గెలుపు ఎప్పుడో ఖాయం అయిందని మెజార్టీ కోసమే ఎన్నికల ప్రచారం చేస్తున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, మైనార్టీ నాయకులు షేక్ నిస్సార్, మాజీ ఎంపీటీసీ షేక్ గౌస్, ఇందూర్ కార్తీక్, గాండ్ల శీను, పార్వతి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.