సాక్షి డిజిటల్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం స్టాప్ రిపోర్టర్ రాము నాయక్ (నవంబర్ :2 ) టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి వనమా పుట్టినరోజు వేడుకలు కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోనీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వనమా కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఎంతోమంది నాయకులను తయారుచేసిన ఘనత మాజీ మంత్రి వనమా కి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొమ్మిడి రమాకాంత్ కొప్పరి నవతన్ పెయింటర్ రాజేష్ మాజీ కో ఆప్షన్ సభ్యులు ఆరిఫ్ ఖాన్ మాజీ ఉప సర్పంచి లు దుర్గేష్ శ్రీహరి నాయకులు రాజా పోకల నగేష్, గోవిందు శివ కనుకుంట్ల రవి బబ్లు గడ్డం వెంకటేశ్వర్లు పులి మల్లయ్య శంకర్ గోపి జంపన్న తదితరులు పాల్గొన్నారు.