సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 1. 2025. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్. జన్నారం మండలం ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని మద్యస్థ ప్రాంతంగా ఉండి జగిత్యాల్ మంచిర్యాల్ నిర్మల్ ఉట్నూర్ ఆదిలాబాద్ వరకు గల ప్రధాన రహదారికి అనేక విధాలుగా జిల్లాలను కలుపుతూ ప్రయాణిస్తున్న రహదారి జన్నారం మండలం మీదుగా వెళుతున్న సందర్భంగా లక్షట్ పేట్ నుండి తపాలాపూర్ వరకు ఫోర్ లైన్ వచ్చిన సర్వే ను పూర్తిస్థాయిలో జన్నారం మండలం నుండి ఖానాపూర్ వరకు కొనసాగించాలని మాల మహానాడు మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు చెక్కుల సురేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఫారెస్ట్ యాక్ట్ ఆంక్షలుతో అభివృద్ధిని అడ్డుకోకూడదని జన్నారం మండలం వైద్యం విద్య ఉపాధిలో ముందుకు వెళుతున్న తరుణంలో ఫోర్ లైన్ రోడ్డు లేకపోవడంతో అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి నిరుద్యోగులకు ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అన్నారు ఫోర్ లైన్ జన్నారం మండలంలో ఏర్పడినట్లయితే అనేక విధాల ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ పారిశ్రామికంగా అభివృద్ధి జరగడానికి వీలు ఉంది అన్నారు.