సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 1 2025 రిపోర్టర్ రాజు గద్వాల్ జిల్లా గద్వాల: చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఇద్దరు నిందితులను గద్వాల టౌన్ పోలీసులు పట్టుకుని రిమాండ్ కు తరలించారు. వారి నుంచి రూ.1.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు శనివారం గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గద్వాల్ టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ వివరాలు వెల్లడించారు.