సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్1, జి.మాడుగుల : కూటమి ప్రభుత్వం పంచాయితీకి మంజూరు నిధులతో ప్రజావసర పనులు చేపడుతున్నట్టు వంతాల పంచాయతీ సర్పంచ్ జి పద్మ తెలిపారు. మండలంలో వంతాల పంచాయతీ చింతగొంది గ్రామంలో 15 ఫైనాన్స్ నిధులతో 60 మీటర్లు సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ పద్మ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైందని దీంతో పంచాయతీలో ఎక్కడా కూడా ఏ అభివృద్ధి పని జరగలేదని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీలకు జీవం పోసారని ఆమె అన్నారు పంచాయతీలకు 15 ఫైనాన్స్ వంటి నిధులు మంజూరు చేయడంతో ప్రజా సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆమె తెలిపారు దీంతో ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ తిరుపతమ్మ, సూపర్ ఎంపీపీ కృష్ణమూర్తి, వార్డు సభ్యులు చిన్న, బాలు, రాజులమ్మ, కూటమి నాయకులు గ్రామస్థులు