కూటమి ప్రభుత్వానికి పని తక్కువ…ప్రచారం ఎక్కువ… వైయస్ఆర్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ :బొక్కానాగేశ్వరరావు (నవంబర్ 2 2025) కూటమి ప్రభుత్వానికి పని తక్కువ…ప్రచారం ఎక్కువ… వైయస్ఆర్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి…నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రైతులకు అన్యాయం… వైయస్ఆర్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొంథా తుఫాన్ ప్రభావం, మునేరు ఆయకట్టులో నష్టపోయిన పంట పొలాలు పరిశీలన కూటమి ప్రభుత్వానిది పని తక్కువ ప్రచారం ఎక్కువగా క‌నిపిస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షులు దేవినేని అవినాష్ మండిప‌డ్డారు. శనివారం జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొంథా తుఫాన్ ప్రభావం, మునేరు ఆయకట్టులో నష్టపోయిన పంట పొలాలను మాజీ సీయం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్ఆర్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , జగ్గయ్యపేట నియోజకవర్గ పరిశీలకులు ఆళ్ల చల్లారావు ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ఏలూరి శివాజీ తో కలిసి పరిశీలించారు. ఈ సంధర్భంగా నందిగామ మండలం మాగల్లు , రామిరెడ్డిపల్లి , కొండూరు, పెనుగంచిప్రోలు మండలంలోని గుమ్మడిదుర్రు, వెల్దుర్తిపాడు, అనిగండ్లపాడు, ముచ్చింతాల గ్రామాలలో పర్యటించి రైతులతో మమేకమై నష్టపోయిన పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సంధర్భంగా నాయకులు మాట్లాడుతూ ఒకవైపు ప్రభుత్వ పెద్దలందరూ టెక్నాలజీని ఉపయోగించి తుపాన్ ని ఎదుర్కొన్నామని గొప్పలు చెప్పుకుంటున్నార‌ని వాస్త‌వం వేరేలా ఉంద‌ని అన్నారు పంట మొత్తానికి గత వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వమే బీమా సొమ్మును చెల్లించేదని, బీమా పరిధిలోని కి రాని రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీని జగనన్న ప్రభుత్వం చెల్లించేదన్నారు.ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక పంటల బీమాను ఎత్తేసిందని, రైతులే ఎకరాకు రూ.200 చొప్పున చెల్లిస్తే వారికి బీమా వర్తించే పరిస్థితి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రైతులకు అన్యాయం జరిగిందని, మైసమ్మ గండి పుడ్చకపోవడంతో మునేరు ఉగ్రరూపం దాల్చడంతో సుమారుగా 2500 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయని తెలిపారు. గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వానికి తువ్వ కాలువ గండ్లను పూడ్చమని ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తువ్వ కాలువ గండ్లను ఇప్పటికీ పూడ్చకపోవడం వల్లనే రైతులు ఎక్కువగా నష్టపోయారని అన్నారు. గత డిసెంబర్ నెలలో మచిలీపట్నంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పెనుగంచిప్రోలు మండల జడ్పీటీసీ, ఎంపీపీ లు తువ్వ కాలువ సమస్య ను ప్రస్తావించగా సాక్షాత్తు ఏపీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర రానున్న 2 నెలల్లో తువ్వ కాలువ గండ్లు పుడుస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికి సంవత్సరం కావొస్తున్న కూటమి ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు.కూటమి ప్రభుత్వం ఇప్పటికైన తువ్వ కాలువ గండ్లను పూడ్చి రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మెంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన వరి పంటకు ఎకరానికి రూ. 50 వేలు, మిర్చి పంటకు రూ. 25 వేలు, పత్తి పంటకు రూ. 25 వేల రూపాయలు రైతులకు నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు. తడిసిన, రంగు మారిన మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని నాణ్యత ప్రమాణాలను పరిగణలోకి తీసుకోకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి చిరుమామిళ్ల శ్రీనివాస్ రావు , రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, జిల్లా రైతు విభాగ ప్రధాన కార్యదర్శి దేవినేని రామారావు, నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు కనగాల రమేష్, జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు నందిగామ మండల పార్టీ అధ్యక్షులు ౠడిద నరసింహారావు, పోన్నం కోటేశ్వరరావు, రేఖా శ్రీను, జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు మండల రైతు విభాగ అధ్యక్షులు గూడపాటి శేషగిరిరావు, పిడికిడి కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *