ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ

*జి.మాడుగులలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారులకు పెన్షన్ సొమ్మును అందజేస్తున్న వార్డ్ నెంబర్,టిడిపి యువ నాయకుడు కూడా వరప్రసాద్ (కె.వి)

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్1, జి.మాడుగుల: కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అర్హులైన లబ్ధిదారులకు ఈ నెల 1వ తేదీన (శనివారం)ఇంటింటికి వెళ్లి సచివాలయం సిబ్బందితో జి. మాడుగుల పంచాయతీ పరిధిలో గల జి.మాడుగుల మెయిన్ రోడ్, చుట్టుమెట్ట , గాంధీనగరం గ్రామాల్లోని పెన్షన్ దారులకు పెన్షన్ సొమ్మును అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పంచాయతీ అధ్యక్షులు, వార్డు సభ్యులు కె వి ఎస్ ఎస్ వర ప్రసాద్, సచివాలయ సిబ్బంది వెల్ఫేర్ అసిస్టెంట్ మనోజ్, మహిళ పోలీస్ పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *